ప్రపంచ ప్రసిద్ధ నెల్లూరు రొట్టెల పండుగలో ఈసారి ఒక అత్యంత ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకుంది. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి దంపతులు తమ సోదరుడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డికి ‘ఎమ్మెల్యే రొట్టె’ను అందించి అందరినీ ఆశ్చర్యపరిచారు. స్వర్ణాల చెరువులో గిరిధర్ రెడ్డికి ‘ఎమ్మెల్యే కావాలనే’ రొట్టెను స్వయంగా అందించి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా కోటంరెడ్డి దంపతులు మాట్లాడుతూ.. గిరిధర్ రెడ్డిని తమ బిడ్డలతో సమానంగా చూస్తామని, వచ్చే ఎన్నికల్లో అతను ఎమ్మెల్యే కావాలనేదే తమ కుటుంబ కోరిక అని స్పష్టం చేశారు.