ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ ఢిల్లీలో అత్యున్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. కేంద్ర మంత్రిత్వ శాఖల కార్యదర్శులతో ఆయన ఇవాళ భేటీ అయ్యారు. ఎన్డీయే సర్కార్ రెండేళ్ల పాలన తర్వాత ప్రభుత్వ పనితీరు, మంత్రుల పనితీరుపై ప్రధాని మోడీ వివరాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. సంస్కరణలు, వ్యాపార సౌలభ్యం (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్) వంటి అంశాలపై ప్రధాని సమీక్షించారు. కేబినెట్ ప్రక్షాళన ప్రచారం వేళ ఈ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. విధాన సంస్కరణలు, వ్యాపార సౌలభ్యాన్ని మెరుగుపరచడం వంటి అంశాలపై ఆయన చర్చించారు.