అయోధ్యలోని రామ్ జన్మభూమి ఆలయాన్ని సందర్శించి, రామ్‌లల్లాను దర్శించుకోవడానికి కాంగ్రెస్ ప్రతినిధి బృందంతో కలిసి వెళ్తున్న యూపీ కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్ రాయ్‌ను పోలీసులు నాటకీయ పరిణామాల మధ్య అరెస్ట్ చేశారు. తాను అయోధ్యకు చేరుకుని హోటల్లో అడుగు పెట్టిన వెంటనే.. యూపీ పోలీసులు తనను గది నుంచే బలవంతంగా అదుపులోకి తీసుకుని పోలీస్ జీపులో తరలించారని అజయ్ రాయ్ స్వయంగా ఆరోపించారు. ఈ అరెస్ట్‌ను తీవ్రంగా ఖండించిన ఆయన.. బీజేపీ ప్రభుత్వ నియంతృత్వానికి ఇది పరాకాష్ట అని మండిపడ్డారు.