శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండల పరిధిలోని వెదుళ్లవలస గ్రామంలో మంగళవారం తెల్లవారుజామున అత్యంత ఘోరమైన, మనసును కలచివేసే విషాద ఉదంతం వెలుగుచూసింది. కన్నతల్లి తన ఇద్దరు కళ్లు తెరివని ఆడపిల్లల పీక కోసి దారుణంగా హతమార్చి, అనంతరం తానూ పీక కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.ఆమె పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు సమాచారం. వరలక్ష్మి ఈ ఘాతుకానికి ఒడిగట్టడానికి గల కారణాలు, కుటుంబ సమస్యలా లేక ఆర్థిక ఇబ్బందులా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.