ప్రేమించాడు… పెళ్లికి నిరాకరించడంతో యువతిని ప్రేమోన్మాది కత్తితో గొంతుకోసి చంపిన సంఘటన కర్నాటక రాష్ట్రం బెంగళూరులోని మహాలక్ష్మి లేఔట్‌లో జరిగింది.అంజలి(23) రాజీవ్ నాలుగు సంవత్సరాల నుంచి గాఢంగా ప్రేమించుకున్నారు. అతడికి గతంలో నేర చరిత్ర ఉందని ప్రియుడి నుంచి ఆమె దూరంగా ఉంటుంది.పెళ్లి ఆమె నిరాకరించడంతో ఇద్దరు మధ్య గొడవ జరిగింది. ఘర్షణ తారాస్థాయికి చేరుకోవడంతో కత్తి తీసుకొని ఆమె గొంతులో పొడిచాడు.వెంటనే స్థానికులు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందిందని పరీక్షించిన వైద్యులు తెలిపారు.