విజయవాడ – హైదరాబాద్ జాతీయ రహదారిపై తెల్లవారుజామున ఒక ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. భీమవరం నుండి హైదరాబాద్ వైపు వస్తున్న ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు..టైర్ పేలడంతో అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టిన అనంతరం రోడ్డు పక్కన ఆగి ఉన్న ఆయిల్ ట్యాంకర్ను బలంగా ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 46 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ఘటనలో 10 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి.