హిమాచల్‌ప్రదేశ్‌లో లాహౌల్- స్పితి జిల్లాలోని ఝల్మా వాగులో నీటి ప్రవాహ ఉద్ధృతి ఒక్కసారిగా పెరిగింది. దీంతో మారుమూల ప్రాంతాలను కలిపే రహదారిలోని కొంత భాగం ఆ నీటి ప్రవాహంలో కొట్టుకుపోయింది. దీంతో ఆ రహదారి మార్గంలో రాక పోకలు నిలిచిపోయాయి. పర్యాటకులు ప్రయాణిస్తున్న వాహనాలు కూడా భారీగా ఉన్నాయి. దీంతో వారంతా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దాదాపు 50కి పైగా పర్యాటకుల వాహనాలు చిక్కుకుపోయాయని జిల్లా ఎస్పీ శివానీ మెహ్లా వెల్లడించారు.