డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అదనపు కార్యదర్శి, ఓఎస్డీగా విధుల్లో కె వెంకట కృష్ణ మరో మూడేళ్లు కొనసాగనున్నారు. నేటితో (జూన్ 30 2026)తో ఆయన పదవీ విరమణ చేయనుండగా.. ఆయన సేవల్ని కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆయన డిప్యూటీ సీఎంకు అదనపు కార్యదర్శి, ఓఎస్డీగా అదే బాధ్యతల్లో కొనసాగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వెంకట కృష్ణ సేవలు అవసరమని పవన్ కళ్యాణ్ నుంచి విజ్ఞప్తి రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.