దేశవ్యాప్తంగా పెట్రోల్ బంకుల్లో పెట్రోల్, డీజిల్ కమర్షియల్ కొనుగోళ్లపై విధించిన పరిమితులను కేంద్రం ఎత్తివేసింది. పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో జూన్ 12న జారీ చేసిన తాత్కాలిక నియంత్రణ ఉత్తర్వులను కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ ఉపసంహరించుకుంది. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి (జులై 1) ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయని స్పష్టంచేసింది.