రాజధాని అమరావతిని యావత్ దేశం గర్వించే నగరంగా, హైదరాబాద్ ప్లస్ స్థాయిలో నిర్మిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. సోమవారం సచివాలయంలో ప్రముఖ కాంట్రాక్టు సంస్థల ప్రతినిధులు, సీఆర్డీఏ అధికారులతో సీఎం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. అమరావతి ప్రైడ్ ఫర్ ఏపీ – ప్రైడ్ ఫర్ ఇండియా అని అభివర్ణించిన ఆయన.. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో భాగస్వాములైనందుకు కాంట్రాక్టర్లు గర్వపడాలని, నిర్దేశిత గడువు కంటే ముందే పనులను పూర్తి చేసి తమ బ్రాండ్ వాల్యూను చాటుకోవాలని పిలుపునిచ్చారు.