రామజన్మభూమి రామాలయ చందాల కేసులో నిందితులందరిని జైలుకు తరలించారు. రామ్‌లల్లాకు విరాళాలు, భారీ స్థాయి హుండీలు కాజేశారనే ఆభియోగాలతో ఎనమండుగురును అరెస్టు చేశారు. వీరిని సోమవారం ఫైజాబాద్ కోర్టులో మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపర్చారు. వీరందరిని 14 రోజుల జుడిషియల్ కస్టడీకి పంపించండని ప్రత్యేక న్యాయమూర్తి రజత్ వర్మ వీడియో కాన్ఫరెన్స్ విచారణ తరువాత ఆదేశించారు. వీరి ఇంతకు ముందటి జుడిషియల్ కస్టడీ గడువు ముగియడంతో వీరిని కోర్టులో ప్రవేశపెట్టారని ప్రాసిక్యూషన్ ప్రత్యేకాధికారి ఉమేష్ దూబే మీడియాకు తెలిపారు.