వెనిజువెలాలో సంభవించిన భయానక భూకంపంఓ ఫుట్‌బాలర్ కుటుంబాన్ని కూడా బలిగొన్నది. వందలాదిమందిని పొట్టనబెట్టుకున్న ఈ ప్రకృతి విపత్తు కారణంగా అర్జెంటీనా ఫుట్‌బాలర్ ల్యూకస్ త్రెజో తన భార్య, పిల్లల్ని కోల్పోయాడు. భూకంపం విషయం తెలిసిన ల్యూకస్ తన భార్యాబిడ్డల ఆచూకీ కోసం మూడు రోజులు గాలించాడు. తనవాళ్లు బతికే ఉంటారనే ఆశతో వెతికిన అతడికి కన్నీళ్లే మిగిలాయి. తన ప్రాణానికి ప్రాణమైన వారిని విగతజీవులుగా చూసిన ఫుట్‌బాలర్ గుండెలవిసేలా రోదించాడు.