ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో భారీ బంగారం గని వెలుగుచూసింది. చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజకవర్గ పరిధిలో విస్తారమైన బంగారం నిల్వలు ఉన్నట్లు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా శాస్త్రవేత్తలు అధికారికంగా గుర్తించారు.కర్ణాటకలోని కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ (KGF)కు కుప్పం భౌగోళికంగా అత్యంత సమీపంలో ఉంటుంది. ఈ నేపథ్యంలోనే కోలార్‌లోని ప్రధాన గోల్డ్ మైనింగ్ బెల్ట్ కుప్పం సరిహద్దుల దాకా విస్తరించి ఉంటుందని భౌగోళిక శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.