విజయనగరం జిల్లా వైసీపీ కార్యాలయ నిర్మాణం వివాదంలో చిక్కుకుంది. వైసీపీ కార్యాలయాన్ని తమ స్థలంలో నిర్మించారని గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతి రాజు ఆరోపించారు. వైసీపీ జిల్లా ఆఫీసును తమ స్థలంలో నిర్మించారని.. దీనిపై సంవత్సరం కిందే కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ స్థలాన్ని ప్రభుత్వ భూమిగా మార్చారని అశోక్ గజపతి రాజు ఆరోపించారు. అనుమతులు లేకుండానే పార్టీ ఆఫీస్ కట్టారని.. చట్టాలను అతిక్రమించి నిర్మాణం చేపట్టారని ఆరోపించారు.