ఐర్లాండ్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీకి ఒక్క అవకాశమూ ఇవ్వకపోవడంపై భారత మాజీ దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇంగ్లాండ్ పర్యటనలో జరిగే తొలి మ్యాచ్ నుంచే అతడిని తుది జట్టులోకి తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు. జట్టులో ఫామ్ కోల్పోయిన ఆటగాళ్లను పక్కనబెట్టి వైభవ్‌కు అవకాశం కల్పించాల్సిన సమయం ఆసన్నమైందని అభిప్రాయపడ్డారు. ఓపెనర్లను మార్చాల్సిన అవసరం లేకపోతే, వైభవ్‌ను మూడో స్థానంలోనైనా బరిలోకి దించాలని పేర్కొన్నారు.