అర్ధరాత్రి గిరిజన బాలికల హాస్టల్ భవనం పైనుంచి దూకడంతో ఇంటర్ విద్యార్థిని గాయపడింది. ఈ సంఘటన వికారాబాద్ జిల్లా తాండూరు మండలం జిన్గుర్తి గ్రామంలో చోటు చేసుకుది. ఈ ప్రమాదంలో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్న మహేశ్వరి అనే విద్యార్థినికి తీవ్ర గాయమైంది. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్లోని గాంధీ హాస్పిటల్కు తరలించారు. విద్యార్థిని భవనం పై నుంచి ఎందుకు దూకింది అనే విషయంపై అధికారులు విచారణ చేపట్టారు.