ప్రతిష్ఠాత్మక శ్రీ అమర్‌నాథ్ జీ యాత్ర-2026 లాంఛనంగా ప్రారంభమైంది. సోమవారం పవిత్ర గుహాలయంలో ‘ప్రథమ పూజ’ను శాస్త్రోక్తంగా నిర్వహించారు. జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఈ కార్యక్రమంలో పాల్గొని, యాత్ర సన్నాహాలకు అధికారికంగా శ్రీకారంచుట్టారు. ఈ సందర్భంగా ఆయన మంచులింగానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ఏడాది అమర్‌నాథ్ యాత్ర జూలై 3న ప్రారంభమై ఆగస్టు 28న శ్రావణ పౌర్ణమి, రక్షా బంధన్ పండుగలతో ముగుస్తుంది. మొత్తం 57 రోజులపాటు ఈ యాత్ర కొనసాగనుంది.