ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియోజకవర్గమైన కొడంగల్‌లోని ఓటర్ల జాబితాపై తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత తీవ్ర ఆరోపణలు చేశారు. కొడంగల్ నియోజకవర్గంలో దాదాపు 22 వేల డూప్లికేట్ ఓట్లు ఉంటే, అందులో కర్ణాటకలోని సెడం నియోజకవర్గానికి చెందినవారే 11 వేల మంది ఓటర్లుగా ఉన్నారని ఆమె పేర్కొన్నారు. గత ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి సరిగ్గా అదే మార్జిన్‌తో గెలవడాన్ని ప్రస్తావిస్తూ.. ఆయనకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ఏమైనా ఫేవర్ చేసిందా అని ప్రశ్నించారు.