నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో రెండో డివిజన్ కార్పొరేటర్ పెరిక యాదయ్య తన వార్డులో ఉన్న సమస్యల బ్యానర్‌ను ప్రదర్శించారు. సమస్యలను పరిష్కరించాలని ఉద్దేశించి మాట్లాడుతుండగా కాంగ్రెస్ కార్పొరేటర్లు ఎదురుదాడికి దిగారు. కార్పొరేటర్ దొడ్డి రమేష్.. సమస్యల పరిష్కరంలో విఫలమవుతున్నారని అనడంతో చర్చకు దారి తీసింది. ఒక దశలో నువ్వు ఎంత అంటే.. నువ్వు ఎంత అంటూ దూషణలు చేసుకున్నారు. పది నిమిషాలు ఒక్కసారిగా సమావేశంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. వెంటనే కొంతమంది కార్పొరేటర్లు, పోలీసులు జోక్యం చేసుకుని ఇరు వర్గాలను సముదాయించారు.