దక్షిణాఫ్రికా విమాన ప్రమాదంలో హసన్‌పర్తి మండలంలోని సీతంపేట గ్రామానికి చెందిన ఆడెపు సుమంత్ (25) దుర్మరణం చెందాడు. సుమంత్ మెకానికల్ ఇంజనీర్ పూర్తి చేసుకుని గత 8 నెలలుగా దక్షిణాఫ్రికాలో సుమంత్ పైలెట్‌గా శిక్షణ పొందుతున్నాడని, ఇందులో భాగంగానే శనివారం దక్షిణాఫ్రికాలోని జోహెన్నస్‌బర్గ్‌లో సుమంత్ విమానాన్ని స్టార్ట్ చేసిన కొద్ది నిమిషాలకే ప్రమాదం జరిగిందని సమాచారం. విమానం కూలడానికి సాంకేతిక లోపమా, ఇతర కారణాలేమైనా ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు జరుగుతున్నట్టు సమాచారం.