అఫ్గానిస్తాన్‌లో శనివారం సాయంత్రం భూకంపం సంభవించింది. శనివారం సాయంత్రం 7:04 గంటల ప్రాంతంలో సంభవించిన ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.2గా నమోదైందని భూకంప శాస్త్రవేత్తలు వెల్లడించారు. అఫ్గానిస్తాన్‌లో భూమి కంపించినప్పటికీ, దాని ప్రభావంతో భారతదేశంలోని రాజధాని ప్రాంతమైన ఢిల్లీ-NCR, జమ్మూ కాశ్మీర్‌తో పాటు ఉత్తర భారతదేశంలోని ఇతర ప్రాంతాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. బలమైన ప్రకంపనలు రావడంతో జనం భయంతో ఇళ్ల నుండి రోడ్లపైకి పరుగులు తీశారు.