మీర్‌పేటలో ప్రమాదవశాత్తు లిఫ్ట్ తెగిపడింది. ఈ ఘటనలో 8 మందికి గాయాలయ్యాయి. స్థానిక హనుమాన్ నగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్ చూసేందుకు వెళ్లిన కొంతమంది వ్యక్తులు ఐదో అంతస్తు నుంచి వస్తుండగా ఈ ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. గాయపడిన వారిని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.