బాలీవుడు సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ తనతోపాటు కుటుంబ సభ్యుల భద్రత విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన ఉంటున్న ముంబై, బాంద్రాలోని గెలాక్సీ లగ్జరీ అపార్ట్మెంట్ను ఖాళీ చేయాలని నిర్ణయించారు. తనకు మరింత భద్రత కల్పించే కొత్త బిల్డింగులోకి మారబోతున్నారు. దాదాపు 50 ఏళ్లుగా ఉంటున్న ఇంటిని విడిచిపెట్టబోతున్నారు.
గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి తరచూ బెదిరింపులు, తన ఇంటివద్ద కాల్పుల నేపథ్యంలో సల్మాన్ ఖాన్ కొత్త ఇంటిలోకి మారాలని నిర్ణయించుకున్నారు.