కృష్ణస్వామి భాగ్యరాజ్ జనవరి 7, 1953న తమిళనాడులోని వెల్లంకోయిల్లో జన్మించారు. భాగ్యరాజ్ 75 సినిమాల్లో నటించిడంతో పాటు 25 సినిమాలకు దర్శకత్వం వహించారు. లెజెండరీ డైరెక్టర్ కె. భారతీరాజాకు అసిస్టెంట్‌గా భాగ్యరాజ్ కెరీర్‌ను ప్రారంభించాడు. విమర్శకుల ప్రశంసలు పొందిన చిత్రం సువరిల్లద చిత్తిరంగళ్ (1979)తో తన స్వంత దర్శకుడిగా సినీ ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. స్క్రిప్ట్ రాయడం, సంగీతం సమకూర్చడం, సినిమాకు దర్శకత్వం వహించడం, ప్రధాన నటుడిగా నటించడం వంటి పనులన్నీ చేస్తూ భారతీయ సినిమాలో ‘వన్ మ్యాన్ స్టూడియో’గా పేరు సంపాదించాడు.