“ఆపరేషన్ సింధూర్” భీకర పోరాటంలో ఆరుగురు ధైర్యవంతులైన సైనికులు తమ ప్రాణాలను అర్పించి అమరులయ్యారు. దేశ రక్షణ కోసం సరిహద్దుల్లో పరాక్రమాన్ని ప్రదర్శించి వీరమరణం పొందిన ఆరుగురు భారతీయ వీర సైనికుల త్యాగానికి అత్యున్నత గౌరవం దక్కింది. న్యూఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారక చిహ్నంపై వీరి పేర్లను సువర్ణాక్షరాలతో లిఖించనున్నారు.ఈ ఆపరేషన్లో దేశాన్ని రక్షిస్తూ ప్రాణాలర్పించిన వారిలో ఐదుగురు భారత సైన్యానికి చెందిన జవాన్లు కాగా, ఒకరు భారత వైమానిక దళానికి (IAF) చెందిన సార్జెంట్ ఉన్నారు.