తీస్తా నది ప్రాజెక్టు వివాదం మరువక ముందే, బంగ్లాదేశ్ ప్రధాని తారిఖ్ రెహమాన్ చైనాతో మరో వ్యూహాత్మక ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఇది భారతదేశానికి దౌత్యపరంగా, ఆర్థికంగా ఇబ్బంది కలిగించే అంశంగా మారవచ్చు అంటున్నారు విశ్లేషకులు. బాగేర్హాట్లోని మోంగ్లా పోర్ట్కు ఆనుకుని ఉన్న 110 ఎకరాల భూమిలో ‘చైనా-బంగ్లాదేశ్ మోంగ్లా పోర్ట్ ఎకనామిక్ జోన్’ అభివృద్ధి చేయనున్నారు. ఇందుకోసం బంగ్లాదేశ్ ఎకనామిక్ జోన్ అథారిటీ, చైనా ప్రభుత్వ యాజమాన్యంలోని సివిల్ ఇంజనీరింగ్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్తో ఒప్పందం చేసుకుంది.