ప్రియదర్శి హీరోగా, నాగదుర్గ హీరోయిన్గా ఇడుపు కాయితం పేరిట సినిమా టైటిల్ ప్రకటన వెలువడటంతో.. ఈ పదం గురించి సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. ఇడుపు కాయితం అంటే అర్థమేంటి.. ఇడుపు కాయితం అంటే.. విడాకుల పత్రం.. అంటే భార్యాభర్తలు విడిపోవడానికి పెద్దల సమక్షంలో కుదుర్చుకున్న ఒప్పంద పత్రం అన్నమాట. ఇప్పుడంటే కోర్టుకు వెళ్లి చట్ట ప్రకారం విడిపోతున్నారు. పూర్వం పెద్ద మనుషుల సమక్షంలో దంపతులు విడిపోవడానికి ఒక ఒప్పందం చేసుకునే వారు. దీన్నే ఇడుపు కాయితం అని పిలిచేవారు.