తన కుమారుడి మరణానికి కారణమైన వారిలో కేవలం సీఐ మాత్రమే లేరని, మరికొంతమంది పోలీసులు కూడా సాయికృష్ణపై దాడి చేశారని విజయలక్ష్మి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. “నా కుమారుడిని ఇంకా కొంతమంది పోలీసులు కొట్టారు. వాళ్లందరినీ వెంటనే అరెస్టు చేయాలి” అని ఆమె డిమాండ్ చేశారు. సీఐ నాగరాజుతోపాటు డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ కూడా తమ ఆవేదనను ఏ మాత్రం పట్టించుకోలేదని ఆమె వాపోయారు. కోర్టుకు కూడా తప్పుడు సమాచారం అందించారని, అన్నింటికీ కచ్చితంగా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.