పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలోని తారతలా ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ఒక భారీ ఫ్యాక్టరీ షెడ్ అకస్మాత్తుగా కూలిపోవడంతో ఇద్దరు కార్మికులు ప్రాణాలు కోల్పోగా, కాంక్రీటు పలకలు, భారీ ఇనుప దూలాల కింద సుమారు 23 మంది కార్మికులు చిక్కుకుపోయినట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు. గాయపడిన పలువురు కార్మికులను ఇప్పటికే స్థానికులు, తోటి సిబ్బంది ఆసుపత్రికి తరలించారు. లోపల చిక్కుకున్న వారి పరిస్థితిపై ఆందోళన వ్యక్తమవుతోంది ఫ్యాక్టరీ షెడ్ నిర్మాణ పనులలో 50 నుండి 60 మంది వరకు కూలీలు పని చేస్తున్నారు.