తెలంగాణ ప్రభుత్వ తదుపరి ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి సంజయ్ జాజు నియమితులయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయన్ను కేంద్ర సర్వీసుల నుంచి రీలీవ్ చేస్తూ డీవోపీటీ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్ర కేడర్ అధికారి కావడంతో వెంటనే ఇక్కడ విధుల్లో జాయిన్ అయ్యేందుకు అడ్డంకులు తొలగినట్లయింది.1992 బ్యాచ్ సంజయ్ జాజు ప్రస్తుతం కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఈ నెలాఖరులో ప్రస్తుత సీఎస్ రామకృష్ణారావు రిటైర్మెంట్ అవనుండటంతో కొత్త సీఎస్ ఎంపిక అనివార్యమైంది.