ఫ్రాన్స్‌లో లక్షలాది మంది ఠారెత్తిస్తున్న ఎండలతో మాడిపోతున్నారు. గత ఐదు రోజుల్లో అసాధారణ ఉష్ణోగ్రతలతో 40 మంది ప్రాణాలు కోల్పోయారు. నేషనల్ వెదర్ సర్వీస్, మెట్రోఫ్రాన్స్, దాదాపు 54 విభాగాలను రెడ్ హీట్ వేవ్ అలర్ట్‌లో ఉంచింది. సగానికి సగం దేశంలో ఈ రెడ్ అలర్ట్ సాగుతోంది. సహారా ఎడారి నుంచి ఉత్తరం వైపు వేడి గాలులు రావడంతో ఫ్రాన్స్‌పై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఎయిర్ కండిషన్ సౌకర్యం విస్తృతంగా లేకపోవడంతో స్కూళ్లు, రైళ్లు, క్రీడాకార్యక్రమాలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది.