హర్యానా నుహ్ జిల్లాలో చారిత్రాత్మక ఘాసేరా గ్రామంలోని గాంధీ పార్కులో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహంపైకి ఎక్కి యువకులు రీల్స్ చేయడం, ఫొటోలకు పోజులిచ్చారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రజలు, సామాజిక సంస్థలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. జాతిపితను అవమానించేలా ప్రవర్తించిన సదరు యువకులపై చర్యలు తీసుకోవాలని నెటిజన్లు పోలీసులను డిమాండ్ చేశారు. బాధ్యులైన యువకులపై చట్టపరమైన చర్యలు ప్రారంభించామని, త్వరలోనే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు.