తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ అసెంబ్లీ వేదికగా తన ప్రభుత్వ భావజాలాన్ని స్పష్టం చేశారు. ద్రావిడ ఉద్యమ మూలపురుషుడు పెరియార్ రామస్వామి సామాజిక సిద్ధాంతాలను తాము మనస్ఫూర్తిగా స్వీకరించినప్పటికీ, ఆయన ప్రబోధించిన నాస్తికత్వ భావజాలాన్ని మాత్రం తాము అంగీకరించడం లేదని తేల్చి చెప్పారు. తాము దేవుడిని బలంగా విశ్వసిస్తామని, ఈ విషయాన్ని ఎప్పుడూ దాచాల్సిన అవసరం లేదని సభలో ప్రకటించారు. తమ నూతన ప్రభుత్వానికి పెరియార్, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, తమిళనాడు మాజీ సీఎం కామరాజ్ సిద్ధాంతాలే పాలకులని విజయ్ పేర్కొన్నారు.