నీట్-యూజీ పేపర్ లీక్ నేపథ్యంలో కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసనలు మంగళవారం నాటికి నాలుగో రోజుకు చేరుకున్నాయి. పరీక్షల పేపర్ లీకేజీలను నిరసిస్తూ సీజేపీ మంగళవారం సాయంత్రం “డైపర్ విరాళాల కార్యక్రమం” చేపట్టింది. ‘డైపర్ ఎ డే కీప్స్ లీక్స్ అవే’ పేరిట సాగుతున్న ఈ ప్రచారంలో భాగంగా తమ మద్దతుదారులందరినీ నిరసన స్థలానికి డైపర్లతో రావాలని కోరింది. నిరసనకారులు ఆ డైపర్లపై ‘కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి’ అని తమ డిమాండ్‌ను రాయనున్నారు