పశ్చిమ బెంగాల్లో టీఎంసీ నేతలపై దాడుల పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే ఎమ్మెల్యేలు, ఎంపీలపై దాడులు జరిగాయి. తాజాగా మరో టీఎంసీ నేతకు ప్రజలు దేహశుద్ధి చేశారు. అవినీతి ఆరోపణల నేపథ్యంలో మాజీ మున్సిపల్ చైర్మన్ సపన్ సామంతను స్థానికులు చుక్కలు చూపించారు. మెడలో చెప్పుల దండ వేసి నడిరోడ్డుపై నడిపించారు. సపన్పై కోడి గుడ్లు, టమోటాలు విసిరారు. రోడ్డు మీద గుంజీలు తీయించి ప్రజలకు క్షమాపణ చెప్పించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.