మెదక్ జిల్లాలో పాత కక్షల నేపధ్యంలో సూరారం గ్రామానికి చెందిన యాట శ్రీధర్ అనే యువకుడిని ఆటోతో ఢీకొట్టి దాడి చేసి దారుణంగా హత్య చేశాడు ప్రభాకర్ శ్రీధర్ ను హత్య చేసినట్టు తెలియడంతో అతని బంధువులు, సోమవారం అర్ధరాత్రి సమయంలో ప్రభాకర్ ఇంటిపై ప్రతిదాడికి దిగారు. ప్రభాకర్ దొరక్కపోవడంతో, అర్ధరాత్రి సమయంలో అతని తండ్రి యాదగిరిని దారుణంగా హతమార్చి, ఎవరికీ అనుమానం రాకుండా మృతదేహాన్ని సమీపంలోని హల్దీ వాగులో పడేశారు. జంట హత్యలు జరగడంతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.