అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీలో మంగళవారం ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. ఫార్మాసిటీ పరిధిలోని దక్షిణ ఎనర్జీ కెమికల్ ఫ్యాక్టరీలో ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ విధుల్లో ఉన్న నలుగురు కార్మికులు మంటల్లో చిక్కుకుని అక్కడికక్కడే సజీవదహనమయ్యారని తెలుస్తోంది. మరణించిన వారిలో ఇద్దరు కార్మికులను అచ్యుతాపురం ప్రాంతానికి చెందిన వాసులుగా అధికారులు గుర్తించారు. ప్రమాదకర గ్యాస్ లీకవుతుందని, ఫ్యాక్టరీలో మంటలు వేగంగా వ్యాపించాయని చెబుతున్నారు.