సీసీ కెమెరాలకు వస్త్రాలు కప్పి వెండి కిరీటం, హుండీ అపహరణ నిర్మల్ జిల్లా బాసరలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానంలో భారీ చోరీ ఘటన చోటుచేసుకుంది. ఆలయంలోని మొదటి అంతస్తులో ఉన్న మహాకాళి అమ్మవారి ఆలయాన్ని లక్ష్యంగా చేసుకున్న దుండగులు గర్భగుడి తాళాలు పగులగొట్టి అమ్మవారికి అలంకరించిన వెండి కిరీటంతో పాటు హుండీని అపహరించారు.అర్థరాత్రి సమయంలో వ్యాస మహర్షి ఆలయం వెనుక వైపు నుంచి ఇద్దరు వ్యక్తులు ఆలయంలోకి ప్రవేశించినట్లు సీసీటీవీ దృశ్యాల్లో గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.