రాయదుర్గం భూముల విషయంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) వైఖరిపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.ఇక నుంచి ఆ బ్యాంకుతో అన్ని రకాల ఆర్థిక లావాదేవీలను నిలిపివేయడంతో పాటు కేంద్ర ప్రభుత్వానికి కూడా ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకుంది.ఈ నేపథ్యంలో అప్రమత్తమైన బ్యాంక్ అధికారులు.. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావుతో అత్యవసరంగా సమావేశం అయ్యారు. ఆర్థిక సంబంధాలను తొలగించుకోవడం, డిపాజిట్లు కూడా వెనక్కి తీసుకోవాలన్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని సీఎస్ ను కోరినట్లు వివరించారు.

