జూన్ 22, 23 న రాష్ట్రంలో చాలాచోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉత్తర, తూర్పు తెలంగాణాలోని కొన్ని జిల్లాలలో ఈరోజు రేపు వడగాల్పుల కొనసాగే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. ఉత్తర ఛత్తీస్గఢ్ నుండి తెలంగాణ వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఒక ద్రోణి విస్తరించి ఉంది.