దేశ రాజధాని దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఆందోళనలు రెండో రోజు కొనసాగుతున్నాయి. దిల్లీ పోలీసులు ఒక్కరోజు మాత్రమే నిరసనలకు అనుమతి ఇచ్చారు. కానీ అనుమతి గడువు ముగిసినప్పటికీ అక్కడ నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రధాని మోదీ, ఇటలీ ప్రధాని మెలోనీకు చెందిన మెలోడీ మీమ్స్ తో ప్లకార్డులు అక్కడ దర్శనమిస్తున్నాయి. ఇక నీట్ రాస్తున్న విద్యార్థులు పరీక్ష పూర్తికాగానే నిరసనలో పాల్గొనాలని దిప్కే పిలుపునిచ్చారు.