అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగా గురువు బాబా రామ్‌దేవ్‌తో సీఎం చంద్రబాబు యోగా సాధన చేశారు. సాధారణంగా యువకులే వేయడానికి కాస్త ఇబ్బందిపడే అత్యంత కష్టమైన ‘సేతు బంధనాసనాన్ని’ (Bridge Pose) 76 ఏళ్ల వయసులో సీఎం చంద్రబాబు నాయుడు ఎంతో సులువుగా ప్రదర్శించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. వృద్ధాప్య ఛాయలు దరిచేరకుండా ముఖ్యమంత్రి ఇంత చురుగ్గా, ఉత్సాహంగా యోగాసనాలు వేసిన ఈ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్స్‌లో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి.