కాకినాడలో జిల్లా నేతలు, అధికారులతో ‘మన ఊరు.. మాట మంతి’ కార్యక్రమంలో జెన్ జీ..జెన్ జీ.. అని యువత చెప్పడం కాదు. మీ భవిష్యత్తును మీరే నిర్ణయించుకోవాలి. మళ్లీ గెలుస్తానో లేదో తెలియదు. కానీ.. మీ కోసం పోరాటం చేయగలను. విపక్షంలో ఉన్నవారు అధికారంలోకి వస్తారేమో అని భయపడకండి. వారు అధికారంలోకి రారు. రౌడీయిజం, గూండాయిజం చేసేవారిని తొక్కి నార తీస్తాం. వారిని ఎవరూ కాపాడలేరు. కొందరు కొన్ని అంశాలపైనే స్పందిస్తారు.. నేను అన్ని అంశాలపై స్పందిస్తా” అని పవన్ కల్యాణ్ అన్నారు.