నేరస్థులకు కులాలు అంటగట్టవద్దని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. కాకినాడలో నిర్వహించిన ‘మన ఊరు.. మాట మంతి’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. “సుగాలి ప్రీతి హత్య కేసును సీబీఐకి అప్పగించాలని గతంలోఆందోళన చేశాను. దీంతో అప్పటి వైకాపా ప్రభుత్వం సీబీఐకి తూతూమంత్రంగా లేఖ రాసింది. మేం వచ్చాక ఈ కేసును టేకప్ చేద్దామంటే.. వైకాపా హయాంలోనే సాక్ష్యాలు ధ్వంసం చేశారు” అని పవన్ అన్నారు.