ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించాలని ఏపీ జేఏసీ ఉద్యోగుల ఐక్య పోరాట వేదిక సూచించింది.పీఆర్సీ కమిటీతోపాటు,ఉద్యోగుల న్యాయబద్దమైన 10 డిమాండ్లను తక్షణమే పరిష్కరించే దిశగా ప్రభుత్వం అడుగులు వేయాలని కోరింది. లేని పక్షంలో ఉద్యమానికి గాని, ఐక్య ఉద్యమాలకు గాని వెనుకాడే ప్రసక్తి లేదని ఏపీ జేఏసీ ఉద్యోగుల ఐక్య పోరాట వేదిక హెచ్చరించింది. కూటమి ప్రభుత్వం పై ఉద్యోగులు పెట్టుకున్న ఆశలు నెరవేరడం వైపు అడుగులు పడాలని ఏపీ జేఏసీ చైర్మన్ ఏ విద్యాసాగర్ అన్నారు.