యోగా సాధనతో రాందేవ్ బాబా అద్భుతాలు సృష్టిస్తున్నారని సీఎం చంద్రబాబు అన్నారు. ఆయన శిక్షణలో యువత యోగాసనాలు అద్భుతంగా ఉన్నాయన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని అమరావతిలోని ఉండవల్లి గుహల వద్ద యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. రాందేవ్ బాబాతో కలిసి చంద్రబాబు యోగా సాధన చేశారు. ఆయన శిక్షణలో జరుగుతున్న యోగా సాధనను తిలకించారు. వివిధ రకాల యోగా ప్రక్రియలను సీఎంకు రాందేవ్ బాబా వివరించారు.