రిలయన్స్ జియో అధినేత ఆకాష్ అంబానీ టెలికాం రంగంలో సరికొత్త సంచలనాలకు తెరతీశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏజెంట్ల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ‘జియో టెలీఫ్రేమ్’ ప్లాట్‌ఫామ్‌ను ఆయన ఆవిష్కరించారు. ఇళ్ల కోసం నెక్స్ట్ జనరేషన్ బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీ ‘జియో హోమ్స్’ను ప్రకటించారు. ఇందులో వినియోగదారులకు కనీవినీ ఎరుగని రీతిలో 5 జీబీపీఎస్ డౌన్లోడ్ స్పీడ్, 1 జీబీపీఎస్ అప్లోడ్ స్పీడ్ అందిస్తామని ఆయన స్పష్టం చేశారు.భవిష్యత్తులో ప్రతి ఇంటికి అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ సేవలు అందించడమే తమ లక్ష్యమని ఆకాష్ అంబానీ వివరించారు.