సంధ్య థియేటర్లో జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించి నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది. ఈ నెల 22న (సోమవారం) వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని నాంపల్లి కోర్టు ఆదేశిస్తూ సమన్లు జారీ చేసింది. ఇకపోతే సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట కేసులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ను 11వ నిందితుడిగా (A11) చిక్కడపల్లి పోలీసులు చేర్చిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నిందితులుగా ఉన్న వారిని వ్యక్తిగతంగా విచారించి ఆ తర్వాత కేసు విచారణ ప్రారంభం కానుంది అని తెలుస్తోంది.