రిలయన్స్ ఇండస్ట్రీస్ వార్షిక సాధారణ సభలో చైర్మన్ ముకేష్ అంబానీ అత్యంత భారీ ప్రకటన చేశారు. జియో ప్లాట్ఫార్మ్స్ ఐపీఓ (Jio IPO) కి రిలయన్స్ బోర్డు అధికారికంగా ఆమోదం తెలిపినట్లు ఆయన వెల్లడించారు. ఇందుకు సంబంధించిన డ్రాఫ్ట్ రెడ్ హెరింగ్ ప్రాస్పెక్టస్ (DRHP) ను మార్కెట్ రెగ్యులేటర్ సెబీ కి దాఖలు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆకాష్ అంబానీ, ఇషా అంబానీ, అనంత్ అంబానీలు ఈ ఐపీఓ ప్రక్రియను ముందుకు నడిపిస్తారని ఆయన పేర్కొన్నారు.