రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్ లో రెవెన్యూ ఇన్స్ పెక్టర్ పై ఓ మహిళ దాడి చేసింది. ప్రభుత్వ భూమి వివాదం విషయంలో ఆర్డీవో, తహసీల్దార్ ఆదేశాల మేరకు ఆర్ఐ, జిపిఒ తుర్కయంజాల్ కు వెళ్లారు. ఆర్ఐ ప్రేమ్ కుమార్ గల్లా పట్టుకుని మహిళ ఈడ్చుకెళ్లింది, అధికారులేనని గ్యారంటీ ఏంటంటూ వాళ్లను సదరు మహిళ బెదిరించడంతో ఐడి కార్డు చూపించగా దాన్ని లాక్కుని, దుర్భాషలాడింది. సర్వేనంబర్ 338లో 1810 గజాల ప్రభుత్వ భూమి విషయంలో ఆర్డీవో సంబంధింత భూమిని ప్రభుత్వాధీనంలోకి తీసుకోవాలని ఆర్డర్ జారీ చేశారు.